
నల్గొండ జిల్లా కట్టంగూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలం యరసానిగూడెంలో వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపు తప్పి డివైడింగ్ లైన్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించి, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కట్టంగూరు ఆస్పత్రికి తరలించారు.
మృతుడు ఖమ్మం జిల్లా ఖిల్లా బజార్ వాసిగా గుర్తించారు. ఖమ్మం హైదరాబాద్‌లో ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
