సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం తర్వాత ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ స్థానానికి మే 13న ఉప ఎన్నికల జరుగుతుందని శనివారం ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని..ఏకగ్రీవానికి అందరూ సహకరించాలని కోరారు లాస్య నందిత సోదరి నివేదిత.
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు తాను కంటోన్మెంట్ శాసనసభ ఉపఎన్నిక బరిలో నిల్చుంటున్నట్లు తెలిపారు. ఎన్నిక ఏకగ్రీవం కావడానికి ఇతర పార్టీలన్నీ సహకరించాలని నివేదిత కోరారు. తన సోదని లాస్య నందిత హఠాన్మరణం అనంతరం ఆమె తొలిసారిగా శనివారం కాకాగూడ గ్రుహలక్ష్మీ కాలనీలోని నివాసంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడారు. లాస్యనందిత ఆశయసాధనకు క్రుషి చేస్తానని త్వరలోనే పార్టీ అధిష్టానాన్ని కలుస్తానని నివేదిత తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘నా జీవితాంతం ధోనీకి రుణపడి ఉంటాను’..అశ్విన్ భావోద్వేగం.
