ఆ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. ఓ వికలాంగుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామడుగు మండలం తిరుమలాపూర్ మండలం కరుపాకులపల్లిలో వికలాంగుడైన చామంతుల కొమురయ్య(60)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ఎస్సై అంజయ్య తెలిపారు.

కరీంనగర్ : ఏరియాలో దారుణం జరిగింది. ఓ వికలాంగుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామడుగు మండలం తిరుమలాపూర్ మండలం కరుపాకులపల్లిలో వికలాంగుడైన చామంతుల కొమురయ్య(60)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ఎస్సై అంజయ్య తెలిపారు.
సోమవారం తెల్లవారు జామున కొమురయ్య తల్లి మల్లమ్మ నిద్ర లేచి చూడగా వికలాంగుడైన కొమురయ్య మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న చిన్న కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రవీందర్, ఎస్సై అంజయ్య కొమురయ్య హత్యకు గల కారణాలను ఆరా తీశారు.
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, కారుపాకలపల్లిలో అదే గ్రామానికి చెందిన నీలం ఐలయ్య అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. గ్రామంలోని ఇంటికీ, ఐలకూ మధ్య జరిగిన భూ వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

