ఇటీవలే కరీంనగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇప్పుడు మరో సారి గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం జరిగింది. కరీంనగర్ లో ఉంటున్న ఓ కుటుంబం మేడారం జాతరకు వెళ్లారు. వెళ్లే ముందు ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టి వెళదామని అనుకున్నారు. మేడారం వెళుతూ ఇంట్లో పూజలు చేసి దేవుడికి దీపం పెట్టారు. ఇంట్లో తాళం వేసి వెళ్లింది. అయితే ఇవాళ(శుక్రవారం) మధ్నాహ్నం మేడారం వెళ్లి ఆ కుటుంబ ఇంటిలో నుంచి పొగలు రావడం మొదలయ్యాయి. మొదట చూసిన అక్కడి స్థానికులు లైట్ తీసుకున్నారు. అయితే అవి రాను రాను ఎక్కవగా రావడంతో ఇంట్లో ఏదో వస్తువుకు అగ్ని అంటుకుని ఉంటుందని ఇంటి యజమానికి కాల్ చేశారు. అయితే ఇంటిని మొత్తం.. పొగలు వ్యాపించడంతో బయట జనాలు భయాందోళన చెందారు. మంటలను అదుపు చేసే పనిలో పడ్డారు. అయితే.. కాసేపు అక్కడ స్థానికులందరు వచ్చి గుంపుగా ఈ ఘటనను చూస్తున్నారు. ఇంతలోనే బాంబు పేలిన సౌండ్ రావడంతో ప్రజలు పరుగులు పెట్టారు. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపడుతున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు పాకకుండా చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: మేడారం క్యూలైన్లలో తొక్కిసలాట.. పలువురికి తీవ్ర గాయాలు
