కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది.మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తన కుమారుడు ఎంపీ నకుల్ నాథ్‌తో కలిసి ఈ సాయంత్రం బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు బీడీ శర్మ సమక్షంలో కమల్ నాథ్, నకుల్ నాథ్ బీజేపీలో చేరనున్నారు. దీనికి సంబంధించి చింద్వారాలో ఈరోజు భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో కమల్ నాథ్, ఆయన మద్దతుదారులైన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరే అవకాశం ఉందన్న చర్చ నడుమ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజ్యసభ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ వర్గాలు కూడా, కమల్ నాథ్ బిజెపిలో చేరడం కన్ఫర్మ్ అవ్వడంతో.. కాంగ్రెస్ నాయకత్వం ఆయనను సంప్రదించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. రాజ్యసభ టిక్కెట్ కోసం తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్న కమల్ నాథ్‌తో విషయాలు సంక్లిష్టంగా మారాయి.
ఇది కూడా చదవండి: తెలిసి…తెలియక చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఈ 5 యాగాలు చేయండి..!!
