రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కనీసం 4 నెలలు అయినా పూర్తి కాలేదు. జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా సీఎం, మంత్రులు కొలువుదీరిన సభా ప్రాంగణం..కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో చావో రేవో అన్నట్లుగా మారిన లోకసభ ఎన్నికలు. వీటన్నింటికీ మించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కలిసి వచ్చిన వేదిక. ఇలాంటి కీలక పరిణామాల మధ్య లోకసభ ఎన్నికల ముగింట కాంగ్రెస్ పార్టీ శనివారం చేపట్టిన జనజాతర మమా అనిపించారు. పాలనా యంత్రాంగం సహకారంతో కరువు పరిస్థిుతులను పక్కనపెట్టి సభ ఏర్పాటు చేసినప్పటికీ అధిష్టానం ఆశించిన స్థాయిలో జనాలు రాలేదు.
పది లక్షల మందితో జనం జాతర సభను విజయవంతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు కూడా ఎన్నోసార్లు చెప్పారు. పది లక్షలు ఉన్నచోట కనీసం 5లక్షలు వస్తారని రాజకీయ పరిశీలకులు, కాంగ్రెస్ నేతలు అనుకున్నారు. కానీ అందులో 5వ వంత కూడా జనం రాలేదు. జన జాతరలో చూస్తే మాత్రం సభా ప్రాంగణంలోనే కాదు..బయట ఉన్న వారిని కలిపినా లెక్క సరిపోలేదంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నిర్వహించినో జోష్ ఇప్పుడు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
పార్లమెంటు ఎన్నికల ముందు అధికార కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శనివారం నిర్వహించిన జన జాతర బహిరంగ సభ జనాలేక బోసిపోయి కనిపించింది. వాస్తవానికి కాంగ్రెస్ నేతలు ముందుగా ప్రకటించినట్లు 10 లక్షలు కాకున్నా.. కనీసంగా 5 లక్షల మందితో సభ జరుగుతుందని అంచనా వేశారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా కనిపించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఢిల్లీ అధిష్ఠానం ఎంతో నమ్మకంతో ఈ బహిరంగ సభకు ఓకే చెప్పింది. అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ వంటి హేమాహేమీలు అంతా కూడా సభకు హాజరయ్యారు.
అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ వేదికను ఎంచుకున్నారు.లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేసిన ఒక్కరోజు తర్వాత హైదరాబాద్‌లో తలపెట్టిన ఈ సభను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకను కాదని హై కమాండ్ హైదరాబాద్‌ను ఎంచుకున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ సభా ఏర్పాట్లపై ఎంతో హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వం, ప్రభుత్వం రెండూ ఉన్నందున జన జాతర మోత మోగుతుందని చాలామంది అనుకున్నారు.
అందుకు అనుగుణంగానే ఏర్పాట్లలోనూ పాలనా యంత్రాంగమే నిమగ్నమైంది. అన్ని జిల్లాల నుంచి జనం, పార్టీ శ్రేణుల్ని సమీకరించేందుకు ప్రణాళిక కూడా రూపొందించుకున్నారు. సభా ఏర్పాట్లను సీఎం, మంత్రులు స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే జన జాతరను ఏకంగా పది లక్షల మందితో నిర్వహించి అగ్రనేత రాహుల్‌ను సంతృప్తిపరచాలని అన్ని శక్తు లూ ఒడ్డారు. కానీ ఎక్కడ తేడా కొట్టిందోగానీ… ఆశించిన దానిలో కనీసం పట్టుమని పది శాతం జనం రాకపోగా, వచ్చిన క్యాడర్‌లోనూ మునుపటి జోష్ కనిపించక నిరూత్సాహ పడ్డారు.
ఇది కూడాచదవండి: భారీగా పెరుగుతున్న బంగారం..71వేలు దాటిన తులం ధర.!
The post కాంగ్రెస్ క్యాడర్ నిరుత్సాహం, తుక్కుగూడలో లక్షకు మించని జనం.! appeared first on tnewstelugu.com.