కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని.. అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇవాళ(బుధవారం) మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన..ఉపాధి హామీ పథకం పని చేసే 3000 మందికి ఇప్పటి వరకు జీతాలు రాలేదు.ఎన్ హెచ్ ఎం లో రెండు నెలల నుండి జీతాలు రాలేదు. వృద్దులకు,వితంతులకు,వికలాంగులకు ఒక నెల పెన్షన్ ఎగకొట్టారు. విద్యార్థులకు స్కాలర్ షిప్ లు లేవు. విదేశీ విద్యకు ఇప్పటివరకు పైసలు ఇవ్వడం లేదు. సీఎంఆర్ఎఫ్ దాదాపు 70 వేల మందికి పెండింగ్ లో పెట్టారు. వైద్య ఖర్చులకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
నాడు పోలవరం ప్రాజెక్టు వాల్ కొట్టుకుపోయింది.డైయా ఫ్రొం వాల్ కొట్టుకుపోయింది..ఇప్పటి వరకు రిపోర్ట్ లేదన్నారు హరీశ్ రావు. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ డి ఎస్ ఏ వచ్చింది. ఆ రిపోర్ట్ 4 నెలలో వస్తుంది అంటున్నారు. అప్పటివరకు ఎందుకు అంత సమయం పడుతుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే వానాకాలం లో కూడా నీళ్లు ఇవ్వరా..వర్ష కాలంలో ఫ్లడ్ వస్తే పంప్ హౌస్ మునిగిపోతే మేము ప్రభుత్వానికి భారం పడకుండా త్వరితగతిన పూర్తి చేసి నీళ్లు లిఫ్ట్ చేశామన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ల్యాండ్ ఆక్వాకేషన్ చేసి ప్రాజెక్టు నిర్మాణం చేయవచ్చు. తుమ్మిడి హెట్టి పై సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడారు.అసెంబ్లీ కి ప్రతిపక్ష నేత ఎందుకు రాలేదు అంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆ విషయం రేవంత్ కూడా తెలుసు..అయినా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఇది సరైంది కాదు. ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని అలా మాట్లాడవచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు.
ఇది కూడా చదవండి:నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అంటూ ప్రజలను రెచ్చగొట్టింది కాంగ్రెస్
