వరికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, నష్టపోయిన పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, BRS అధినేత కేసీఆర్ పిలుపు మేరకు సూర్యపేట జిల్లా కేంద్రంలో BRS నిరసన దీక్ష చేపట్టింది.దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి, సూర్యపేట MLA జగదీష్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం.చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పాలనలో ఆగమాగం అయినం. సాగర్ కింద ఒక్క తడి ఇస్తే పంటలు బ్రతికేవి. ఈ ప్రభుత్వం మాత్రం దున్నపోతుపై వాన పడ్డ చందంగా వ్యవహరిస్తోంది. కాళేశ్వరంపై చిల్లర ప్రయత్నం చేస్తోంది. ప్రతిరోజూ కుట్రలు చేస్తూ కాలయాపన చేస్తోంది. ఒక్కరోజు కూడా వ్యవసాయ రంగంపై సమీక్ష చేయలేదు. మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకొని అన్నదాతలు నోట్లో మట్టికొట్టారు ఈ జిల్లా మంత్రులు. జిల్లా మంత్రులు ఇద్దరు దొంగలే.సీఎం రేవంత్ నెలల్లో సగం రోజులు ఢిల్లోలో ఉంటున్నాడు. తెలంగాణలో దోచుకొని ఢిల్లీకి కప్పం కడుతున్నాడు. మూడు నెలల్లోనే తెలంగాణ ను ఆగం చేశారు కాంగ్రెస్ వాళ్లు. మన కళ్ళముందే తెలంగాణ సర్వ నాశనం అవుతోంది. చూడలేక కేసీఆర్ మండు ఎండల్లో పొలం బాట పట్టారు. నిన్న కేసీఆర్ రైతుల దగ్గరకు పోతే, కాంగ్రెస్ వాళ్లు మాత్రం క్రికెట్ మ్యాచ్ లకు పోయి ఎంజాయ్ చేస్తున్నారన్నారు.
అన్నదాతలు అంటే మర్యాద లేదని.. అన్నదాతలు అంటేనే కాంగ్రెస్ కు పడదన్నారు జగదీష్ రెడ్డి. బరితెగించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్లు.అలీబాబా 40 దొంగల ముఠాగా తయారైంది కాంగ్రెస్ పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లు గజ దొంగల్లాగా దోచుకుంటున్నారు.. ఈ రాష్ట్రం దొంగల పాలైందన్నారు. ఈ దొంగలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టర్లను, మిల్లర్లను, వ్యాపారులను భయపెట్టి వసూళ్లు చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన ద్రోహం వల్ల పంటలు అన్ని ఎండిపోయాయన్నారు. డిమాండ్ చేస్తున్నాం ఎకరాకు 25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని అని అన్నారు. అంతేకాదు..రుణమాఫీ చేయాలి. ధాన్యం కి 500 బోనస్ ఇవ్వాలి.ఇవి అన్ని అమలు చేయాలని కోరుతున్నాం. ఇస్తాం అని ఎన్నికల సంఘానికి లేఖ రాయండి BRS పార్టీగా మీకు సపోర్ట్ చేస్తామన్నారు జగదీష్ రెడ్డి.
ఇది కూడా చదవండి: కేసీఆర్ పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నా