రైతులంటే కాంగ్రెస్ సర్కారకు అలుసుగా మారిందన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అన్నం పెట్టే అన్నదాతల అక్రందనలు ప్రభుత్వ పెద్దల చెవులకు ఎక్కడం లేదని విమర్శించారు. ఇవాళ(శుక్రవారం) సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీతో పాటు మండలంలోని ముస్త్యాల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.
ఈ క్రమంలో చేర్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన పల్లా… సమ్మక్క బ్యారేజ్‌లో గోదావరి జలాలు ఉన్నాయని వాటిని వెంటనే లిఫ్ట్ చేసి ధర్మసాగర్ రిజర్వాయర్‌కు పంపింగ్ చేయాలన్నారు. అక్కడ నుంచి బొమ్మకూరుకు నీటిని పంపించి వెంటనే మద్దూరు మండలంలోని లద్నూర్, కొమురవెల్లి మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేయాలని డిమాండ్ చేశారు.
10 ఏండ్ల పాలన సాగించిన కేసీఆర్ ఏ ఒక్కరోజు రైతన్నల పంటలు ఎండిపోనియ్య లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. అధికారులు స్పందించని పక్షంలో రైతులతో ఉద్యమాలు చేపడతామన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.
ఇది కూడా చదవండి: అన్ని వర్గాల ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ
