కాళేశ్వరం: కాళేశ్వరం-మేడిగడ్డ బ్యారేజీని ఐఏఎస్ శిక్షణ అధికారులు గురువారం సందర్శించారు. మర్రి చెన్నారెడ్డి మానవాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయల్, కోర్సు డైరెక్టర్ ఎఎస్ రామచంద్రం ఆదేశాల మేరకు నోడ్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారులు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు.

కాళేశ్వరం : కాళేశ్వరం – మేడిగడ్డ బ్యారేజీని ఐఏఎస్ శిక్షణ అధికారులు గురువారం సందర్శించారు. మర్రి చెన్నారెడ్డి మానవాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయల్, కోర్సు డైరెక్టర్ ఎఎస్ రామచంద్రం ఆదేశాల మేరకు నోడ్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారులు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు.
2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు ఉమాశంకర్, అమిత్, మయాంక్, వికాస్, కిరణ్మయి, శ్రద్ధ అందరూ బ్యారేజీని సందర్శించారు. కార్యక్రమంలో మేడిగడ్డ బ్యారేజీ డీఈ తిరుపతిరెడ్డి, ఇరిగేషన్ ఏఈ, జేఈలు, మహదేవపూర్ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాళేశ్వరం ఆలయంలో ఐఏఎస్ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

