జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ గోదావరి నీటిలో రెండు లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కులవృత్తి అంతరించిపోకుండా కాపాడేందుకు సీఎం కేసీఆర్ అనేక రాయితీ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు, ఇతర సామాగ్రి అందించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సొసైటీలు ఏర్పాటు చేసి కొత్త భవనాలకు మంజూరైనట్లు తెలిపారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో చేపలు పట్టే అవకాశాలు సమాజంలోని మత్స్యకారులకు లభిస్తున్నాయని మంత్రి కొప్పుల అన్నారు.
The post కులవృత్తుల వారికి రక్షణ పథకం అమలు appeared first on T News Telugu.
