ముంబై: మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని బోయిసల్ ఇండస్ట్రియల్ జోన్లోని కెమికల్ కంపెనీలో రియాక్టర్లో పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వేడి రసాయనాలు పడి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు కంపెనీలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
రియాక్టర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 18 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వెల్లడించారు. పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.
814759