కేంద్ర ప్రభుత్వం మరోసారి డిజిటల్ సమ్మెను ప్రారంభించింది. 18 OTT యాప్‌లు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లతో సహా 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై నిషేధం విధించింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ ప్లాట్‌ఫారమ్‌లకు చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లు ఐటీ చట్టం నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తుండటంతోనే చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ OTT ప్లాట్‌ఫారమ్‌లలో అసభ్యకరమైన కంటెంట్‌ను చూపుతున్నారని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి బ్లాక్ చేసింది. అశ్లీల, అభ్యంతరకమైన కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఈ 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌ను తొలగించడానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హెచ్చరికలు జారీ చేశారు.తొలగించిన 18 ఒటీటీ యాప్‌లలో డ్రీమ్స్ ఫిల్మ్స్, Voovi, Yessma, Uncut Adda, TriFlicks, X Prime, Neon PrimePlay ఉన్నాయి.
Ministry of I&B blocks 18 OTT platforms for obscene and vulgar content after multiple warnings; 19 websites, 10 apps, 57 social media handles of OTT platforms blocked nationwide, says the government. pic.twitter.com/03ojj3YEiF
— ANI (@ANI) March 14, 2024
ఈ 18 ఓటీటీ యాప్‌లతో పాటు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లను కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ 10 యాప్‌లలో 7 యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్ నుండి , 3 యాప్‌లు యాపిల్ యాప్ స్టోర్ నుండి తీసివేసింది. ఇది మాత్రమే కాదు, అసభ్యకరమైన కంటెంట్‌తో కూడిన 57 సోషల్ మీడియా ఖాతాలపై కూడా చర్యలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: కేకేఆర్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ కు కీలక ఆటగాడు దూరం.!
The post కేంద్రం సంచలన నిర్ణయం, 18 OTT ప్లాట్‌ఫామ్స్‌పై వేటు.! appeared first on tnewstelugu.com.
