బడ్జెట్ లో దేశాభివృద్ధికి నిధులు కేటాయించలేదన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. చైనా, జపాన్ వంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయన్నారు. భారతదేశంలో, వారు ఆర్థిక అభివృద్ధి కంటే రాజకీయాలపై దృష్టి పెడతారు. అయితే ఇతర దేశాల మాదిరిగానే మన దేశ ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారిస్తే మనమే నంబర్ వన్ గా నిలుస్తాం. ప్రపంచంలోనే పేరుగాంచిన బ్రాండ్లు మన దేశంలో ఎందుకు లేవని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఎన్‌హెచ్‌ఆర్‌డీ ఆధ్వర్యంలో ‘డీకోడింగ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మన దేశంలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. మొత్తం జనాభాలో 60 శాతం మంది యువతే ఉన్నారని తెలిపారు. దేశంలో యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనే ఉద్దేశం తనకు లేదన్నారు.
కేంద్ర బడ్జెట్ పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..! appeared first on T News Telugu
