KCR | సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోసేందుకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లి, మీకు మేము అండగా ఉంటామన్న భరోసా కల్పించనున్నారు.
KCR | హైదరాబాద్ : సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోసేందుకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లి, మీకు మేము అండగా ఉంటామన్న భరోసా కల్పించనున్నారు. రేపు సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు.
కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఇదే..
ఆదివారం ఉదయం 8:30 గంటలకు కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి జిల్లాల పర్యటనకు రోడ్డు మార్గంలో బయల్దేరుతారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు ఉదయం 10:30 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. 11:30 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం, అర్వపల్లి మండలం, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయల్దేరి.. 1:30 గంటల వరకు సూర్యాపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనే లంచ్ చేయనున్నారు. 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి నల్లగొండ జిల్లాకు బయల్దేరుతారు. సాయంత్రం 4:30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి ఎర్రవెల్లికి బయల్దేరనున్నారు. రోడ్డు మార్గం గుండా ప్రయాణించి రాత్రి 7 గంటలకు కేసీఆర్ ఎర్రవెల్లికి చేరుకోనున్నారు.
