ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమన్నారు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యంత కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ( మంగళవారం) జిన్నారం మండలంలోని అండూరులో కల్వర్టు, జంగంపేట-వావిలాల గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఆ తర్వాత మాట్లాడిన మహిపాల్ రెడ్డి…గ్రామాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు అవసరమైన బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణం చేపడుతున్నాం. ఇవి పూర్తయితే ప్రజలకు దూరభారం తగ్గుతుంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజల అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పదేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పూర్తి సహకారం అందించి నిధులు కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.
ఇది కూడా చదవండి: సిరిసిల్లలో చేనేత కార్మికుడు ఆత్మహత్య
