తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేరిపెస్తే చెరగని సత్యం…ఆయన సాధించిన ఆర్థిక ప్రగతి అంటూ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ నిన్న(ఆదివారం) ఎండిన పంటల పరిశీలన కోసం మూడు జిల్లాల్లో పర్యటించారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఈ సందర్భంగా గులాబీ బాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ ఏం చేశారు అనే వారికి కౌంటర్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ గడ్డ..బీఆర్ఎస్ అడ్డా..ఎగిరేది గులాబీ జెండానే.!
కేసీఆర్ ఏం చేశారని అడుగుతున్నారని.. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమంగా ఉందన్నారు. రూ.3.09 లక్షల తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. కేసీఆర్ సాధించిన ప్రగతి చెరిపినా చెరగని సత్యం అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఆయా రాష్ట్రాల పర్ క్యాపిటాకు సంబంధించిన ఫొటోను కేటీఆర్ జత చేశారు.
₹ 3.09 లక్షల తలసరి ఆదాయం తో పెద్ద రాష్ట్రాల లో దేశం లోనే తెలంగాణ No -1.
అయినా ఏమి చెసినవ్ కేసిఆర్ అని మీడియా, ప్రతిపక్షాలు అంటాయి..
చేరిపెస్తే చెరగని సత్యం కేసిఆర్ గారు సాధించిన ఆర్థిక ప్రగతి.
జై తెలంగాణ! pic.twitter.com/JkIqzxqyMM
— KTR (@KTRBRS) April 1, 2024