
కొత్త సంవత్సరం తొలిరోజు గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరో భారం పడింది. వాణిజ్య అవసరాల కోసం సిలిండర్‌కు 25 రూపాయలు. పెరిగిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఇప్పటివరకు దేశ రాజధాని న్యూఢిల్లీలో 19కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1,768కి చేరింది. ముంబైలో రూ.1,721కి పెరిగింది.
తాజా పెంపుతో కోల్ కతాలో రూ.1,870, చెన్నైలో రూ.1,917కి చేరింది. అదే సమయంలో గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1105గా ఉంది.
