IndiGo | జైపూర్ (Jaipur) నుంచి కోల్‌కతా (Kolkata) వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో సాంకేతిక సమస్య (technical fault) తలెత్తింది.
IndiGo | జైపూర్ (Jaipur) నుంచి కోల్‌కతా (Kolkata) వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో సాంకేతిక సమస్య (technical fault) తలెత్తింది. దీంతో విమానాన్ని తిరిగి జైపూర్‌కు మళ్లించినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది.
ఇండిగో 6E784 విమానం సోమవారం రాజస్థాన్ జైపూర్ నుంచి పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాకు బయల్దేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన కాసేపటికి అందులో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే జైపూర్‌కు మళ్లించినట్లు తెలిపారు. ఆ విమానం జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు చెప్పారు. ఇక విమానంలోని ప్రయాణికుల కోసం ప్రత్యేక ఫ్లైట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Also Read..
PM Modi | ఈ మధుర స్మృతులు చిరకాలం నిలిచిపోతాయి.. ప్రాణప్రతిష్ట వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
Amitabh Bachchan | రామచంద్రకీ జై.. బాలరాముడి దర్శన ఫొటోలను షేర్ చేసిన బిగ్‌బీ
Ayodhya Ram Mandir | అయోధ్య రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు.. వీడియో
