అందాల సుందరి రింకీ చక్మా క్యాన్సర్ తో మరణించారు. ఆమె వయస్సు 29 సంవత్సరాలు. రెండేళ్ల నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న ఆమె…ఈరోజు మరణించారు. త్రిపురకు చెందిన రింకీ 2017లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్లో నిలిచారు. 2022లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడినప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ వ్యాధి ఉపిరితిత్తులు, తలకు వ్యాపించింది. అప్పటి నుంచి చికిత్స అందించిన ప్రయోజనం లేదు. ఫిబ్రవరి 22న ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె స్నేహితురాలు, అందాల పోటీ సహచరులు ఆమెకోసం నిధులు సేకరించినట్లు తెలిపారు. ఎనాడూ అనారోగ్యం గురించి బయటపెట్టని రింకీ కొద్దివారాల క్రితం సుదీర్ఘపోస్టు పెట్టి ఆర్థిక సాయం అడిగారు. చివరకు కొద్దిగంటల క్రితం ప్రాణాలు కోల్పోయినట్లు బంధువులు చెప్పారు. ఈ విషయాన్ని మిస్ ఇండియా ఆర్గనైజేషన్ కూడా ధ్రువీకరించింది.
#RinkyChakma, Miss India Tripura 2017, passes away at 29 following battle with cancer
Read: https://t.co/bblsURigBbhttps://t.co/bblsURigBb
— WION (@WIONews) February 29, 2024
ఇది కూడా చదవండి: తల్లికాబోతున్న దీపికా పదుకొనె..సెప్టెంబర్లో బిడ్డకు స్వాగతం అంటూ పోస్ట్..!
