నిజామాబాద్ : బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ పై ఆయన మండిపడ్డారు.
ఎంపీ అరవింద్ తనపై పరుష పదజాలంతో మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ప్రజా నాయకులపై వాడే భాష తన ఇష్టానుసారం అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాజకీయాల కోసం బీజేపీ నేతలు ప్రజలు, యువత, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు.
ప్రజలకు మేలు చేయకుంటే బీజేపీ నేతలు వెళ్లిపోవాలి కానీ సమాజాన్ని నాశనం చేయకూడదని మంత్రి విముల అన్నారు. ఎవరు పనులు చేస్తున్నారో.. ఎవరు టైమ్ పాస్ చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని.. అరవింద్‌కు తగిన సమయంలో ప్రజలే చెబుతారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
The post ఖబడ్దార్ అరవింద్.. నోరు మూసుకో.. appeared first on T News Telugu.
