గంధం రాములు |ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ద్వారా కర్మాగారాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములు పిలుపునిచ్చారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న హరితహారం పథకం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక చైర్మన్ గంధం రాములు కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని జీహెచ్ఎంసీ పార్కులో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. తన పుట్టినరోజున మొక్కలు నాటడం సంతోషకరమని వెల్లడించారు. మూడేళ్ల నుంచి పుట్టిన రోజున మొక్కలు నాటుతామన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండుగుల రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్, సోషల్ మీడియా చీఫ్ మోహన్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
