
హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలో డంప్ ట్రక్కు బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలిలోని విప్రో స్క్వేర్ వద్ద అదుపు తప్పి ట్రాఫిక్ లైట్ల వద్ద ఆగి ఉన్న నాలుగు కార్లు, రెండు సైకిళ్లపై వేగంగా వెళ్తున్న డంప్ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుడు స్విగ్గీ డెలివరీ మ్యాన్ నసీర్‌గా గుర్తించారు. గాయపడిన వారిలో అబ్దుల్ అనే విద్యార్థికి కాలు విరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డంప్ ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
