గుండెపోటు |ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మానుకొండ రాధాకిషోర్ కుమారుడు శ్రీధర్ (28) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. కొన్నేళ్ల క్రితం శ్రీధర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు.

గుండెపోటు |రఘునాథపాలెం, జూలై 10: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మానుకొండ రాధాకిశోర్ కుమారుడు శ్రీధర్ (28) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. కొన్నేళ్ల క్రితం శ్రీధర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. శ్రీధర్ ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు.
సోమవారం ఉదయం ఎప్పటిలాగే జిమ్‌కు వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే శ్రీధర్‌కు గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నగరంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పరీక్షల్లో మృతి చెందినట్లు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని రవాణా శాఖ మంత్రి ప్వ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. మృతుని తల్లిదండ్రులను ఓదార్చారు.

