రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు పథకం అద్భుతమని శాసనమండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నిరుపేదలకు ఈ కార్యక్రమం వరం లాంటిదన్నారు.

నల్గొండ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం అద్భుతమైన పథకమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నిరుపేదలకు ఈ కార్యక్రమం వరం లాంటిదన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గుత్తా సుఖేందర్ రెడ్డి తనకు కేటాయించిన అద్దాలను ఆరోగ్య లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాన్ని తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోందని వెల్లడించారు.
రైతులకు రైతుబంధు, రైతుబీమా అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి.. కంటివెలుగు పథకానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అండగా లేరని గుర్తు చేశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించిన సిబ్బందిని ఆయన అభినందించారు.
