సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఒకే స్కూలుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొద్ది కాలం వ్యవధిలోని ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్నారు.
సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏం జరుగుతోందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. విద్యార్థులు ఎందుకు ఇలా వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అడిగారు. పూర్తిస్థాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం.. ఇలాంటి అనేక సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పూర్తిస్థాయి సంక్షేమ శాఖ మంత్రిని నియమించడంతో పాటు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు ఎమ్మెల్సీ కవిత.
ఇది కూడా చదవండి: సూర్యపేటలో విషాదం..మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య..!!
