ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు స్నేహితులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి స్పీడ్ గా దూసుకొచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. కారు స్పీడ్‌లో ఉండటంతో ముగ్గురు అమాంత ఎగిరి పడిపోయారు. ప్రమాదం తర్వాత కారు ఆపకుండా డ్రైవర్ అలాగే వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయింది. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి జరిగింది.
మరణించిన వారిని మోయిన్ అక్తర్, అకిల్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన తాహిర్ ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎంకు బట్టికి అవమానం
