హైదరాబాద్ : గోషామహల్ లోని చక్నవాడిలో ఈ ఉదయం పెద్ద డ్రెయిన్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కార్లు, కూరగాయల బండ్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం కావడంతో బస్తీలో తెరిచిన మార్కెట్‌లోని కూరగాయల దుకాణం సహా పలువురికి కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

అదే సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనాస్థలికి చేరుకుని కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. గోషా మహల్ చక్ నవాడిలో నాలా కూలిపోవడంపై అధికారులను ప్రశ్నించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని, ఘటనపై విచారణకు అధికారులను ఆదేశించారు. నాలా ప్రాంతంలోని ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులను ఆదేశించారు. నాలాపై విచారణ జరిపి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
