ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్ పూర్ ఉమేద్ ఫ్యాలెస్ ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. వీరిద్దరి హల్దీ వేడుక ఘనంగా జరిగింది. దానికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య హల్దీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాజారెడ్డి, ప్రియా హల్దీ వేడుకల్లో షర్మిల, అనిల్ దంపతులు కూతురు, తల్లి విజయమ్మ, ప్రియా తల్లిదండ్రులు కలిసి దిగినొ ఫొటోలు వైరల్ అయ్యాయి.




