
ట్రాఫిక్ ప్రమాదం | మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై-పూణే జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మారుతీ సుజుకీ ఎర్టిగా కారు పూణె నుంచి ముంబైకి వెళ్తోంది. ఈ క్రమంలో రాయ్‌గఢ్ జిల్లా కొప్లిలో ముంబై-పూణే జాతీయ రహదారిపై కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
844110
