
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి కాంకర్ రాష్ట్ర రహదారిపై జగత్రాలో ప్రయాణికులతో వెళ్తున్న బొలెరోను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో బొలెరో నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలిపారు.
మృతులంతా ధామ్‌తరి జిల్లా సోరెం భట్‌గావ్ గ్రామంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందినవారు. వీరంతా బంధువుల పెళ్లి కోసం క్యాంకర్స్‌కు వెళ్తున్నారని తెలిపారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ కోసం వెతుకుతున్నామని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.

కాగా, ప్రమాదంపై సీఎం భూపేష్ బఘెల్ ట్విట్టర్‌లో విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆశిస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.https://twitter.com/ANI_MP_CG_RJ/status/1653877146560126977?s=20
