ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మరణించారు. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులు మధ్య ఎదురు కాల్పులు జరినట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.
అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారాసపడినట్లు సమాచారం. ఈ క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించిన మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపడంతో నలుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో లభించిన మందుపాతరలు, ఆయుధాలు, మందగుండు సామాగ్రిని స్వాధినం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: 500పోస్టులతో తెలంగాణలో భారీ నోటిఫికేషన్.!
The post ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..నలుగురు మావోయిస్టులు మృతి.! appeared first on tnewstelugu.com.