Mamata Banerjee: జమిలి ఎన్నికల విధానాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించారు. రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటికి రాసిన లేఖలో బెంగాల్ సీఎం తన నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లించారు. నిరంకుశత్వంగా పాలించాలని బీజేపీ చూస్తోందని, నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తానని ఆమె అన్నారు.
కర్నాటక: జమిలి ఎన్నికలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానాన్ని ఆమె వ్యతిరేకించారు. జమిలి ఎన్నికల ద్వారా భారత రాజ్యాంగ స్వరూన్నే మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. నిరంకుశత్వంగా పాలించాలని బీజేపీ భావిస్తున్నట్లు ఆమె విమర్శించారు. నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తానని, అందుకే జమిలి ఎన్నికల విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆమె చెప్పారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీకి రాసిన లేఖలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. జమిలి ఎన్నికల నిర్వహణ గురించి రామ్నాథ్ కమిటీ దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేపడుతున్న విషయం తెలిసిందే.
