
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో పేలుడుతో గందరగోళం నెలకొంది. జమ్మూ సమీపంలోని సిద్రా వంతెనపై మంగళవారం రాత్రి సంధ్యా సమయంలో అనుమానాస్పద పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి. సిధ్ర వంతెన చెక్‌పోస్టు వద్ద భారీ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని జమ్మూ సీనియర్ ఎస్పీ చందన్ కోహ్లీ తెలిపారు. పేలుడుకు పాల్పడిన వారిని గుర్తించలేదని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
872660
