
చెన్నైలో జాతీయ మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్‌లో విషాదం నెలకొంది. కేఈ కుమార్ (59) రెండో రౌండ్‌లో కారు ప్రమాదంలో మరణించారు. రేసులో ఉండగా ఆయన కారు అదుపు తప్పి మరో డ్రైవర్ కారును ఢీకొని బోల్తా పడింది. నిర్వాహకులు వెంటనే అతడిని కారులోంచి దించి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కుమార్‌ను బతికించేందుకు వైద్యులు ప్రయత్నించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమార్ గౌరవార్థం ఇతర మ్యాచ్‌లు రద్దు చేయబడ్డాయి.
