
తాజాగా యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య “కస్టడీ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో చైతూ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. నాగ చైతన్య తన తదుపరి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్న సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకుడు. నాగ చైతన్య మునుపెన్నడూ చూడని కొత్త అవతార్‌లో కనిపిస్తాడని అంటున్నారు. తాజాగా చిత్ర నిర్మాత బోనీ వాసు ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మత్స్యకారుల నేపథ్యంలో సాగే కథ ఇది. ఇక్కడ ఫిషింగ్ బోట్ డ్రైవర్‌గా నాగ చైతన్య నటించనున్నాడు. బన్నీ వాసు మాట్లాడుతూ సూరత్‌లో జరిగిన యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ కథ రూపొందిందని, ఇది ప్రేమకథ అని అన్నారు.
