దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో మూడు సరికొత్త రకాల్లో అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లను పరిచయం చేసింది. ఇందులో భాగంగానే యూఏఈ, యూఎస్‌ఏ, వార్షిక ప్యాకేజీలను ప్రకటించింది.
- అంతర్జాతీయ ప్లాన్లను తెచ్చిన సంస్థ
- ఇన్-ఫ్లైట్ కోసమూ పరిచయం
న్యూఢిల్లీ, జనవరి 11: దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో మూడు సరికొత్త రకాల్లో అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లను పరిచయం చేసింది. ఇందులో భాగంగానే యూఏఈ, యూఎస్‌ఏ, వార్షిక ప్యాకేజీలను ప్రకటించింది. వీటిలోనే ఉచిత ఇన్-ఫ్లైట్ ప్రయోజనాలతోనూ ప్రత్యేకంగా ప్లాన్లను తీసుకొచ్చింది. అలాగే వన్‌డే ఇన్-ఫ్లైట్ డాటా, వాయిస్ ప్లాన్లనూ ప్రవేశపెట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
యూఏఈ ప్యాక్‌లో..
21 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.2,998గా, 14 రోజులది రూ.1,598 గా, 7 రోజులది రూ.898గా ఉన్నాయి. రూ.2,998 ప్లాన్‌లో 250 నిమిషాల చొప్పున ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ వాయిస్ కాల్స్ ఉంటాయి. 7జీబీ డాటా, 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. రూ.1,598 ప్లాన్‌లో 150 నిమిషాల చొప్పున ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ వాయిస్ కాల్స్, 3జీబీ డాటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.898 ప్లాన్‌లో 100 నిమిషాల చొప్పున ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్, 1జీబీ డాటా, 100 ఎస్‌ఎంఎస్‌లుంటాయి.
వార్షిక ప్లాన్
వార్షిక అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్ ధర రూ.2,799. ఇందులో 2జీబీ డాటా లభిస్తుంది. 100 నిమిషాల వాయిస్ కాల్స్ (ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్) ఉంటాయి. 100 ఎస్‌ఎంఎస్‌లుంటాయి. 51 దేశాల్లో చెల్లుబాటు అవుతుంది.

అమెరికా ప్యాక్‌లో..
30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.3,455గా ఉన్నది. అలాగే 21 రోజులది రూ.2,555, 10 రోజులది రూ.1,555గా ఉన్నాయి. రూ.3,455 ప్లాన్‌లో 250 నిమిషాల చొప్పున వాయిస్ కాల్స్, 25జీబీ డాటా, 100 ఎస్‌ఎంఎస్‌లుంటాయి. రూ.2,555 ప్లాన్‌లో 250 నిమిషాల వాయిస్ కాల్స్, 15జీబీ డాటా, 100 ఎస్‌ఎంఎస్‌లుంటాయి. రూ.1,555 ప్లాన్‌లో 150 నిమిషాల వాయిస్ కాల్స్, 7జీబీ డాటా, 100 ఎస్‌ఎంఎస్‌లున్నాయి.

ఇన్-ఫ్లైట్ ప్లాన్లలో..
- 250ఎంబీ డాటాతో రూ. 195 ప్లాన్‌ను తెచ్చింది. 500ఎంబీ డాటాతో రూ.295, 1జీబీ డాటాతో రూ.595గా ఉన్నాయి. ఈ ప్లాన్ల వ్యాలిడిటీ ఒక్కరోజే. 100 నిమిషాల వాయిస్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం ఉంటుంది. 22 ఎయిర్‌లైన్స్‌ల్లో చెల్లుబాటు అవుతుంది. ఇక వాయిస్, డాటా ప్యాక్‌లతో ఫ్రీ ఇన్-ఫ్లైట్ ప్రయోజనాలున్న ప్లాన్ల ధర రూ.2,499, రూ.3,999, రూ.4,999, రూ.5,999గా ఉన్నాయి.
- రూ.2,499 ప్లాన్ వ్యాలిడిటీ 10 రోజులు. డాటా 250ఎంబీ. 100 నిమిషాల ఔట్‌గోయింగ్, ఉచిత ఇన్‌కమింగ్ వాయిస్ కాల్స్ సదుపాయం ఉంటుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లుంటాయి. 35 దేశాల్లో చెల్లుతుంది.
- రూ.3,999 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. డాటా 4జీబీ. 250 నిమిషాల ఔట్‌గోయింగ్, ఉచిత ఇన్‌కమింగ్ వాయిస్ కాల్స్ ఉంటాయి. 100 ఎస్‌ఎంఎస్‌లు. 51 దేశాల్లో కవరేజీ ఉంటుంది.
- రూ.4,999 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. డాటా 5జీబీ. 1,500 నిమిషాలు ఔట్‌గోయింగ్, ఉచిత ఇన్‌కమింగ్ వాయిస్ కాల్స్ ఉంటాయి. 1,500 ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు. 35 దేశాలకు వర్తిస్తుంది.
- రూ.5,999 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. డాటా 6జీబీ. 400 నిమిషాల ఔట్‌గోయింగ్ (లోకల్, ఇండియా, ఆర్‌వోడబ్ల్యూ, వైఫై) ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్, 500 ఎస్‌ఎంఎస్‌లుంటాయి.
