- నేటి నుంచి రిజిస్ట్రేషన్లు
జమ్ము, ఏప్రిల్ 14: అమర్‌నాథ్ వార్షిక యాత్ర జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని శ్రీ అమర్‌నాథ్ తీర్థక్షేత్ర బోర్డు శనివారం ప్రకటించింది. 52 రోజులపాటు సాగే యాత్రకు సంబంధించిన ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి మొదలవుతుందని బోర్డు వెల్లడించింది. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని 3,880 మీటర్ల ఎత్తులోని గుహలో ఏర్పడే మంచులింగాన్ని దర్శించేందుకు ప్రతియేటా నిర్వహించే అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు.