జైన సమాజ సేవే సమాజానికి మేలు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు జైన సమాజ్ కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లో నైట్ క్లినిక్ ను ప్రారంభించారు. ఆసుపత్రిని మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎలాంటి వ్యక్తి అయినా, సంస్థ అయినా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆదరణ లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత సమాజంలో పేదల కోసం ఖర్చు చేయాలని సూచించారు. నిరుపేదలకు ఉచిత వైద్య సేవలను ప్రారంభించిన జైన సమాజ్, కిమ్స్ ఆసుపత్రిని మంత్రి తలసాని అభినందించారు.
The post జైన సమాజ సేవ సమాజానికి మేలు చేస్తుంది – మంత్రి తలసాని appeared first on T News Telugu.
