ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED)ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంతో, ఢిల్లీ మంత్రి అతిషి కీలక విషయాలు తెలిపారు. ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అవసరమైతే ప్రభుత్వాన్ని జైలు నుండే నడిపిస్తారన్నారు. మీడియాతో మాట్లాడిన అతిషి.. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్ అరెస్టు చేయడం రాజకీయ కుట్రేనని ఆరోపించారు. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగానే ఉంటారని కూడా ఆమె అన్నారు.
అవసరమైతే, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని జైలు నుండి నడిపిస్తారని మేము ముందే చెప్పాము. ఆయన ప్రభుత్వాన్ని నడపగలడు, అలా చేయకుండా ఏ రూల్ అతన్ని నిరోధించదు. అతను దోషిగా నిర్ధారించబడలేదు. కావున అతనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటాడని అతిషి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ.. కేజ్రీవాల్‌ను చూసి భయపడుతున్నారని, ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తులో దర్యాప్తు సంస్థలకు ఒక్క పైసా కూడా దొరకలేదని ఆమె ఆరోపించారు.
భారీ సంఖ్యలో పోలీసులు, పారామిలటరీ బలగాలు హాజరుకావడంతో, ఈడీ కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తుందని స్పష్టమైంది. దర్యాప్తు ప్రారంభించిన గడచిన రెండేళ్లలో, ఈడీ, సీబీఐ.. ఆప్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇళ్లపై దాడులు నిర్వహించాయి. వారికి ఒక్క పైసా కూడా దొరకలేదన్నారు మంత్రి అతిషి.
ఇది కూడా చదవండి: కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు
The post జైలు నుంచే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడుపుతారు appeared first on tnewstelugu.com.
