చాలా స్టార్టప్‌లు ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో పలు కంపెనీలు చాలా మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. 3% ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వివిధ శాఖలకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.
Zomato ప్రస్తుతం 3,800 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వ్యయ పొదుపు చర్యల్లో భాగంగానే ఉద్యోగాల కోత అని కంపెనీ స్పష్టం చేసింది. పనితీరు ఆధారిత మదింపు ప్రక్రియలో భాగంగా ప్రతి సంవత్సరం 3% మంది ఉద్యోగులు తొలగించబడతారు. అంతే.
The post 3% సిబ్బందిని తొలగిస్తున్న Zomato appeared first on T News Telugu.