
- దీక్షా దివస్ సందర్భంగా కార్యకర్తలకు క్రీడా పోటీలు
- ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అవార్డు ప్రదానం
- ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ, నవంబర్ 29: కార్యకర్తలంతా అన్నదమ్ముల్లా వ్యవహరించి పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా చైర్ పర్సన్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. యూసుఫ్‌గూడ డివిజన్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులతో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షకు 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం దీక్షా దివస్ నిర్వహిస్తున్నారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ యూసుఫ్‌గూడ డివిజన్ కార్పొరేటర్ భండారి రాజ్‌కుమార్ పటేల్ ఆధ్వర్యంలో ఈసారి టీఆర్ఎస్ కార్యకర్తలకు కబడ్డీ, ఖోఖో, క్యారమ్ బోర్డు, చెస్, షెటిల్ తదితర ఆటలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ టోర్నమెంట్‌ను ప్రారంభించి చదరంగం, వివిధ ఆటల్లో కార్యకర్తలను కలిశారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శి సంతోష్ ముదిరాజ్, నర్సింహదాస్ తదితరులు పాల్గొన్నారు.
861257
