టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రనాద్ సిన్హాకు ఈడీ ఇవాళ(మంగళవారం) సమన్లు జారీ చేసింది. మార్చి 22న సిన్హా నివాసంపై ఈడీ అధికారులు దాడి చేశారు. మార్చి 27న దర్యాప్తు సంస్ధ ఎదుట విచారణకు హాజరు కావాలని సిన్హాకు జారీ చేసిన సమన్లలో ఈడీ తెలిపింది. ఇక సిన్హా నివాసంపై దాడుల నేపథ్యంలో పలు ఆస్తి పేపర్లు, మొబైల్ ఫోన్‌తో పాటు రూ. 40 లక్షల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అంత భారీ మొత్తాన్ని ఇంటి దగ్గర ఎందుకు ఉంచాల్సివచ్చిందనే విషయంపై మంత్రి వివరణ ఇవ్వలేదని ఈడీ అధికారులు తెలిపారు. ఈడీ ఆయన నివాసంపై దాడులు చేపట్టిన సమయంలో బోల్పూర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోని తమ పూర్వీకుల గ్రామం మురారైలో సిన్హా ఉన్నారు.
ఇది కూడా చదవండి: 40 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నా
The post టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో బెంగాల్ మంత్రికి ఈడీ సమన్లు appeared first on tnewstelugu.com.