టెక్సాస్‌లోని సబర్బన్ డల్లాస్‌లోని అలెన్ మాల్‌లోకి చొరబడ్డ ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నిందితులు సహా 9 మంది చనిపోయారు. ఈ కాల్పుల్లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో హైదరాబాద్ కొత్తపేటకు చెందిన తాటికొండ ఐశ్వర్య కూడా ఉంది.

వాషింగ్టన్: అమెరికా కాల్పుల్లో టెక్సాస్‌లో ఓ యువతి మృతి చెందింది. టెక్సాస్‌లోని సబర్బన్ డల్లాస్‌లోని అలెన్ మాల్‌లోకి చొరబడ్డ ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నిందితులు సహా 9 మంది చనిపోయారు. ఈ కాల్పుల్లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో హైదరాబాద్ కొత్తపేటకు చెందిన తాటికొండ ఐశ్వర్య కూడా ఉంది.
తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఐశ్వర్య మృతి చెందింది. రంగారెడ్డి మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి తాటికొండ నర్సిరెడ్డి కుమార్తె ఐశ్వర్య ఉన్నత చదువుల కోసం కొన్నేళ్ల క్రితం టెక్సాస్ వెళ్లింది. వీరి స్వస్థలం సూర్యాపేట జిల్లా నేరడుచర్ల. కాగా, ఐశ్వర్య మృతిని అమెరికా తెలుగు సంఘాలు మరియు ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అలెన్ మాల్ కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు కూడా చనిపోయాడు. మాల్‌లోకి ప్రవేశించే ముందు ఒక పోలీసు అధికారిని కూడా దుండగులు కాల్చి చంపారు. అయితే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన నిందితుడిని కాల్చిచంపారు. కాల్పులు జరిగినప్పుడు మాల్‌లో వందలాది మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.
