మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధకారికంగా నిర్వహించింది. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగలేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు పలువురు హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం ఆయన సేవలను కొనియాడారు సీఎం రేవంత్ .
తండ్రి వారసత్వాన్ని తీసుకుని శ్రీధర్ బాబు స్వయం క్రుషితో ఎదిగారన్నారు. తండ్రి నుంచి స్పూర్తి పొంది శాసన సభ వ్యవహారాలు నిర్వహిస్తున్నారన్నారు. ఆయన సేవలు, అనుభవం పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామని సీఎం అన్నారు. శ్రీపాదరావులాంటి నేత తెలంగాణలో ఉండటం మన అద్రుష్టం అన్నారు. కాగా ట్యాంక్ బండ్ పై తెలంగాణ ప్రముఖల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. మన నాయకుల త్యాగం, అక్కడికి వచ్చే వారికి తెలియాలన్నారు. కుమురంభీం, రాంజీగొండు, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, చాకలిఐలమ్మ, జైపాల్రెడ్డి, శ్రీపాదరావు వంటి ప్రముఖల విగ్రహాలు నెలకొల్పేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రేవంత్ తెలిపారు.
ఇది కూడా చదవండి: మరోసారి వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి ప్రధాని మోదీ.!
