ఝార్ఖండ్‌లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన జాంతారలోని కాలా ఝరియా రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది. ప్రాథమికంగా 12 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అధికారులు కన్ఫాం చేయాల్సి ఉంది.
ప్రమాదం విషయం తెలియగానే వైద్య సిబ్బంది, అంబులెన్స్ లు సంఘటన స్థలానికి చేరుకుంది. కొంతమంది రైల్వే ట్రాక్ దాటుతుండగా అంగా ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. 12 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి:తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ
The post ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని 12 మంది మృతి appeared first on tnewstelugu.com.
