Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ట్రాఫిక్‌ చలానా… వద్దు ఇక ఆందోళన-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 9, 2024No Comments

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి చలానాలు విధిస్తున్నారు. ఇలా విధించిన చలానాలు సకాలంలో చెల్లించకపోవడంతో భారీగా పేరుకుపోయాయి. దీంతో వారికి ఊరట కల్పిస్తూ ప్రభుత్వం డిసెంబర్‌ 28న భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది.

January 9, 2024 / 05:33 AM IST
ట్రాఫిక్‌ చలానా… వద్దు ఇక ఆందోళన
  • చెల్లించేందుకు రేపటివరకు గడువు
  • పెండింగ్‌ చలాన్లపై భారీ డిస్కౌంట్‌
  • జిల్లాలోని వాహనదారులకు ఊరట
  • జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల వాహనాలపై కేసులు
  • పేరుకుపోయిన రూ.9 కోట్లకు పైగా బకాయిలు
  • ఇప్పటివరకు మూడు కోట్ల వరకు వసూలు

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి చలానాలు విధిస్తున్నారు. ఇలా విధించిన చలానాలు సకాలంలో చెల్లించకపోవడంతో భారీగా పేరుకుపోయాయి. దీంతో వారికి ఊరట కల్పిస్తూ ప్రభుత్వం డిసెంబర్‌ 28న భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీంతో పెద్ద మొత్తంలో చలాన్ల ఫైన్‌ ఉన్న వాహనదారులు డిస్కౌంట్‌తో ఫైన్‌ చెల్లించే అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ ఈ నెల 10వరకు మాత్రమే ఉండడంతో బకాయిలు చెల్లించేందుకువాహనదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. మీ సేవ, ఈ సేవ కేంద్రాలతోపాటు ఆన్‌లైన్‌లో సైతం ఈ చలానా చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వం ప్రకటించిన ఈ బంపర్‌ ఆఫర్‌తో సుమారు 2 లక్షల వాహనదారులకు ప్రయోజనం కలుగనున్నది. హెల్మెట్‌ ధరించకపోవడం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌, నంబర్‌ప్లేట్‌ లేకుండా వాహనం నడపడం, ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్‌ రైడింగ్‌ చేయడం, ఇన్సూరెన్స్‌ లేకపోవడంతోపాటు ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంప్‌ చేయడం, రాంగ్‌ రూట్‌లో వాహనం నడపడం తదితర నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు. వీరందరికీ రాయితీతో కూడిన బకాయిలు చెల్లించే అవకాశం లభించించడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి, జరిమానాలు ఎదుర్కొంటున్న వాహనదారులకు ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన సంవత్సరం నేపథ్యంలో పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల చెల్లింపుపై భారీ రాయితీ ప్రకటించింది. ఈ ప్రకటన వాహనదారులకు కొంత ఊరట కలిగించింది. డిసెంబర్‌ 26 నుంచి ఈ నెల10 వరకు ఆన్‌లైన్‌లో పెండింగ్‌ చలాన్లు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు పోలీసులు అధికారులు తెలిపారు.టూ/త్రీ వీలర్‌ వాహనదారులకు జరిమానా చెల్లింపులో 80 శాతం, కార్లు, భారీ వాహనాలకు 60 శాతం, ఆర్టీసీ వాహనాలకు 90 శాతం రాయితీ ప్రకటించారు. నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించేవారికే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు.

-నిజామాబాద్‌ క్రైం,జనవరి 8

జిల్లావ్యాప్తంగా రూ.14.15 కోట్లకుపైగా బకాయిలు..

జిల్లా వ్యాప్తంగా నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతున్న 3, 34,644 మంది వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.వీరికి సంబంధించి గత డిసెంబర్‌ 27 నాటికి రూ.14.15కోట్లకు పైగా జరిమానా బకాయిలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో నుంచి డిసెంబర్‌ చివరి వరకు సుమారు 35 శాతం జరిమానా వసూలైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

కొనసాగుతున్న జరిమానాల చెల్లింపు

ప్రభుత్వం డిస్కౌంట్‌లో కూడిన ఆఫర్‌ ప్రకటించడంతో వాహనదారులు పెండింగ్‌ జరిమానాలు చెల్లించేందుకు ముందుకువస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 8 వరకు సుమారు రూ.3 కోట్ల వరకు పెండింగ్‌ చలాన్లు వసూలైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. జిల్లా వ్యాప్తంగా ఈ-చలానా జరిమానాలు మరో రూ.6 కోట్ల వరకు ఉంటాయని పేర్కొన్నాయి.

భారీ ఆఫర్‌పై విస్తృత ప్రచారం

పెండింగ్‌ చలాన్ల వసూలు కోసం పోలీసు యంత్రాంగం వినూత్న ప్రచారం చేపట్టింది. మునుపెన్నడూ లేని విధంగా జరిమానాను రాబట్టేందుకు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రధానకూడళ్లు, జంక్షన్లలో పెండింగ్‌ చలానా చెల్లించడానికి ప్రభుత్వం కల్పించిన డిస్కౌంట్‌ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రధానప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తుండడం విశేషం

Previous article

కుక్కల దాడిలో బాలుడి మృతి

Next article

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.