
త్వరలో ట్విట్టర్లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. సిఫార్సు చేసిన ట్వీట్లు మరియు అనుసరించిన ట్వీట్ల మధ్య సులభంగా మారడం, వినియోగదారు ఇంటర్ఫేస్లో మార్పులు, ట్వీట్ వివరాల కోసం బుక్‌మార్క్ బటన్ మరియు ట్వీట్ల క్యారెక్టర్ కౌంట్‌ను పెంచడం వంటి ఫీచర్లు ఉంటాయని ట్విట్టర్ హెడ్ ఎలోన్ మస్క్ వెల్లడించారు. వచ్చే వారం రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
ట్విట్టర్లో మరిన్ని ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని మస్క్ చేసిన ప్రకటనతో యూజర్లు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇప్పటికే సగం మంది సిబ్బందిని తొలగించిన ఎలాన్ మస్క్ తాజాగా డబ్లిన్, సింగపూర్‌లోని తన కేంద్ర కార్యాలయాల్లోని సిబ్బందిని తొలగించారు.
