
ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత 50% మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారతదేశంలో తన ఉద్యోగులను తొలగించినందుకు ట్విట్టర్‌ను మేము ఖండిస్తున్నాము. మరో ఉద్యోగానికి మారేందుకు తగినంత సమయం కావాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సిబ్బంది తొలగింపును మంత్రి తీవ్రంగా ఖండించారు. భారతదేశంలోని 200 మందికి పైగా ఉద్యోగులు ట్విట్టర్‌కు వీడ్కోలు పలికారు. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగాలను పూర్తిగా తొలగించిన మస్క్.. ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లోని కొంతమంది ఉద్యోగులను కూడా తొలగించారు.