మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్ మ్యాచ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ విజయం సాధించింది. ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది. దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో.. ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యూపీ ఢిల్లీని ఓడించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. దీప్తి శర్మ (48 బంతుల్లో 59) హాఫ్ సెంచరీతో మరోసారి ఆకట్టుకుంది. కెప్టెన్ అలిస్సా హీలీ (29) పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఇక దీప్తి డిఫెండింగ్‌లో కూడా ఆకట్టుకుంది.. కీలక మ్యాచ్‌లో ఆమెకు నాలుగు వికెట్లు దక్కాయి. సైమా ఠాకూర్, గ్రేస్ హారిస్ 2 వికెట్లు తీయగా.. సోఫీ ఎక్లెస్టోన్ ఒక వికెట్ తీసింది.
ఛేజింగ్ లో ఢిల్లీ తరఫున కెప్టెన్ మెగ్ లానింగ్ (60) హాఫ్ సెంచరీ నమోదు చేసింది. కనీసం 20 పరుగులు కూడా చేయకపోవడంతో మిగిలిన బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలమయ్యారు.
ఇది కూడా చదవండి: 92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి సిద్ధమైన మీడియా కింగ్ రూపర్ట్ మర్డోక్
